![]() |
![]() |

బిగ్‌బాస్ సీజన్-8 లో ఫ్యామిలీ వీక్ మొదలైంది. మొదటగా నబీల్ వాళ్ల అమ్మ రాగా.. ఆ తర్వాత రోహిణి వాళ్ళ అమ్మ గీవిందమ్మ హౌస్ లోకి వచ్చింది.
హౌస్‌లో ఎవడు ఎలా పోయిన పర్లేన్నట్టు విష్ణుప్రియ, పృథ్వీ, నిఖిల్, యష్మీలది వాళ్ల గోల వాళ్ళదే. నిఖిల్ గడ్డం తీసేశాకా అస్సలు బోగాలేదని.. పృథ్వీయే బావన్నాడంటూ యష్మీ అనగానే విష్ణుకి తెలిస్తే చంపేస్తదని నిఖిల్ అన్నాడు. మరోవైపు బిగ్‌బాస్ హౌస్ మేట్స్ అందరితో ఫ్రీజ్ గేమ్ ఆడించాడు. అదే ఎక్కడివాళ్ళు అక్కడే ఆగాలి..ఫాస్ట్ ఫార్వర్డ్ లో వెళ్ళాలి.. ఇలాంటివి బిగ్ బాస్ చేపించాడు. అవకాశం ఇచ్చాడు కదా అని పృథ్వీపై పడిపోయి మరీ రెచ్చిపోయింది విష్ణుప్రియ. మరోవైపు తేజ తెగ ఏడ్చాడు. అందరి పేరెంట్స్ వస్తారు.. కానీ నా కోసం మాత్రం ఎవరు రారు.. ప్లీజ్ బిగ్‌బాస్.. నేను ఏడిస్తే మా అమ్మకి నచ్చదు.. కానీ అమ్మ కోసం ఏడుస్తా అనుకోలేదు బిగ్‌బాస్.. ఇంకా కష్టపడి ఆడతా బిగ్‌బాస్ ప్లీజ్.. ఇంత పెద్ద పనిష్మెంట్ నాకు ఇవ్వొద్దు.. మీరు ఏదంటే అదే.. నాకు ఇంతకంటే పెద్ద పనిష్మెంట్ ఏం ఉండదు.. కావాలంటే ఎవ్రీ వీక్ డైరెక్ట్ నామినేషన్ అవుతానంటూ తేజ ఏడ్చాడు. ఇక కాసేపటి తర్వాత అవినాష్ దగ్గర నిఖిల్ ఓపెన్ అయ్యాడు. నాకు తేజదే గిల్ట్ అవుతుంది.. మన ఫ్యామిలీ అందరూ వస్తారు.. వాడికి రారు అంటూ నిఖిల్ అన్నాడు. దీనికి నువ్వు వాడి పేరు చెప్పావా కన్ఫెషన్ రూమ్‌లో అంటూ అవినాష్ అడుగగా.. నాకేం తెలుసురా.. అలా అవుతుందని.. ఇప్పుడు మా అమ్మ వచ్చినా నేను అంత హ్యాపీగా ఫీల్ అవ్వలేనంటూ నిఖిల్ అన్నాడు. ఇదే విషయం తేజతో అవినాష్ చెప్పుకొచ్చాడు.
ఇక హౌస్ లో గౌతమ్ పెళ్ళికొడుకుగా, రోహిణికి పెళ్ళిచూపులు స్కిట్ చేపించాడు. అవినాష్, టేస్టీ తేజ, రోహిణి ఎప్పటిలాగే ఈ స్కిట్ లోను ఆకట్టుకున్నారు. ఎంటర్‌టైన్మెంట్ టాస్క్ ఏదైనా ఉందంటే అవినాష్, రోహిణిలకి మించి ఎవరు చేయరనేది వాస్తవం. ఇక హౌస్ లోకి వచ్చిన రోహిణి వాళ్ళ అమ్మ ఇదే విషయం చెప్పింది. నువ్వు, తేజ సోఫాలో కూర్చొని మనం జోక్స్ వేయడానికి సరదగా నవ్వించాడని మాత్రమేరా మనకి కప్పులు రావని రోహిణి, తేజ మాట్లాడుకున్నది చూశానని గోవిందమ్మ అంది. అలా ఎందుకు అనుకుంటున్నారు. మీ ఆట మీరు ఆడండి. మీరు హౌస్ లో బాగా ఎంటర్‌టైన్ ఇస్తున్నారు అలాగే ఉండండి.. ఎవరిని నమ్మకండి అంటూ రోహిణితో వాళ్ళ అమ్మ గోవిందమ్మ చెప్పుకొచ్చింది.
![]() |
![]() |